శబరిమలలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి: కార్పొరేటర్

78చూసినవారు
శబరిమలలో భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి: కార్పొరేటర్
శబరిమలలో అయ్యప్ప స్వాములకు ఎదురవుతున్న సమస్యల పరిష్కారం కోసం అయ్యప్ప తత్వాన్ని కించపరిచే శక్తులపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చంపాపేట కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి అన్నారు. తెలంగాణ అయ్యప్ప ఐక్యవేదిక ముఖ్య గురుస్వాముల సమావేశం బుధవారం కర్మన్ ఘాట్ హరిహర క్షేత్ర అయ్యప్ప ఆలయంలో రమణ గురుస్వామి అధ్యక్షతన నిర్వహించారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గురుస్వాములు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :