జాతీయస్థాయి పోటీలకు రాజశ్రీ మందిర్ విద్యార్థిని

73చూసినవారు
జాతీయస్థాయి పోటీలకు రాజశ్రీ మందిర్ విద్యార్థిని
మండల పరిధిలోని పెద్ద అంబర్పేట్ రాజశ్రీ విద్య మందిర్ లో 8వ తరగతి చదువుతున్న భావన జాతీయస్తాయి ఖోఖో పోటీలకు గురువారం ఎంపికైంది. ఈనెల 13, 14, 15 హోసింగ్ బోర్డు ప్లే గ్రౌండ్ లో నిర్వహించిన 34వ రాష్ట్ర స్థాయి ఖోఖోలో భావన రంగారెడ్డి జిల్లాకు ప్రథనిధ్యం వహించి చక్కటి ప్రతిభ కనబర్చి తెలంగాణా రాష్ట్ర ఖోఖో జట్టుకు ఎంపికైంది. ఈనెల 28 నుండి అక్టోబర్ 3 వరకు ఝార్ఖండ్లో జరిగే జాతీయ జట్టు సభ్యరాలుగా పాల్గొంటుంది.

సంబంధిత పోస్ట్