ఆమనగల్లు: జాబ్ మేళాలో 230 మంది ఉద్యోగాలకు ఎంపిక

71చూసినవారు
ఆమనగల్లు: జాబ్ మేళాలో 230 మంది ఉద్యోగాలకు ఎంపిక
టాస్క్ ఆధ్వర్యంలో కల్వకుర్తిలో మంగళవారం నిర్వహించిన జాబ్ మేళాలో 230 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి తెలిపారు. మేళాలో 2500 మంది నిరుద్యోగులు పాల్గొనగా వారికి వివిధ కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఉద్యోగాలకు ఎంపికైన వారికి నియామక పత్రాలు అందించిన ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడమే టాస్క్ లక్ష్యమని చెప్పారు. ఉద్యోగాలు పొందని వారు ఆందోళన చెందవద్దన్నారు.

సంబంధిత పోస్ట్