ఆమనగల్లు పట్టణంలో టాస్క్ సి ఓ ఓ, ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మూడో రోజు నిర్వహించిన ఉచిత కంటి పరీక్షలు, ఆపరేషన్ శిబిరంలో గురువారం వైద్యులు 640 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 290 మందికి కంటి అద్దాలను అందజేశారు. 36 మందికి కంటి ఆపరేషన్లు అవసరమని గుర్తించారు. శిబిరాన్ని కల్వకుర్తి నియోజకవర్గం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శిబిరంలో వైద్యులు, ఫౌండేషన్ సభ్యులు రచ్చ శ్రీరాములు, కొండల్ రెడ్డి, మల్లయ్య, కొండల్ యాదవ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.