ఆమనగల్లు: గుడిసె కాలిపోయిన బాధితునికి సహాయం

56చూసినవారు
ఆమనగల్లు: గుడిసె కాలిపోయిన బాధితునికి సహాయం
కల్వకుర్తి నియోజకవర్గంలోని తర్నికల్ తాండాకు చెందిన సీత్య నాయక్ కుటుంబం నివసిస్తున్న పూరిగుడిసె ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని కాలిపోయినది. విషయం తెలుసుకున్న రాష్ట్ర మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, తలకొండపల్లి మాజీ జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ మంగళవారం బాధితునికి 50 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులు, ఆర్థిక సహాయం, దుస్తులు అందజేశారు. బాధితుని ఇంటి నిర్మాణానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్