తలకొండపల్లి మండలం గట్టు ఇప్పలపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సంక్రాంతి పర్వదినం రోజు సైతం కొనసాగించారు. ఈ సందర్భంగా మంగళవారం జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 11 నూతన మండలాల ఏర్పాటు చేస్తున్నట్లు క్యాబినెట్ తీర్మానంలో తమ గ్రామాన్ని చేర్చాలని కోరారు. అందుకోసం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కృషి చేయాలని చెప్పారు.