రాజేంద్రనగర్ సర్కిల్‌లోని మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలో ఓల్డ్ కర్నూల్ రోడ్డు, రాంచరణ్ నుండి బుద్వెల్ వరకు గత 3 నెలలుగా విధి దీపాలు వెలగడం లేదు. స్థానికులు దీని వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారిలో వెలుతురు లేకపోవడంతో రాత్రి సమయంలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆదివారం బాధితులు తెలిపారు. అధికారుల నుంచి స్పందన ఆశిస్తున్న ప్రజలు, సమస్య పరిష్కారానికి వేచి చూస్తున్నారు.