రంగారెడ్డి జిల్లాలో వానొచ్చింది. వరదొచ్చింది. చెరువుల్లోకి నీరొచ్చింది. కానీ. ఉచిత చేప పిల్లల జాడే లేదు. మళ్లీ మళ్లీ టెండర్లు పిలిచి ప్రభుత్వం కాలయాపన చేస్తుండడంతో ఈ ఏడాది ఉచిత చేప పిల్లల పంపిణీ ఉన్నట్లా.? లేనట్లా.? అన్న అనుమానాలను మత్స్య కారులు వ్యక్తం చేస్తున్నారు. చేపల వేటనే నమ్ముకుని జీవిస్తున్న 9, 136 మత్స్యకార కుటుంబాలు జీవనోపాధి విషయంలో ఆందోళన చెందుతున్నారు.