హైదరాబాద్‌లో ఉరుములతో కురిసిన వర్షం

56చూసినవారు
భాగ్యనగరంలో పలు చోట్ల శనివారం ఉదయం ఉండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. రాజేంద్రనగర్‌, తుర్కయాం జల్‌, కొత్తపేట, సరూర్‌నగర్‌, నాగోల్‌, చైతన్యపురి, చంపాపేట, సైదాబాద్‌, ముషీరాబాద్, విద్యానగర్, రాంనగర్, బాగ్ లింగంపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్డులో వర్షం కురిసింది. దీంతో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వేసవి ఉక్కపోతతో అల్లాడు తున్న నగరవాసులకు ఈ వర్షం కొంత ఉపశమనాన్ని ఇచ్చింది.

సంబంధిత పోస్ట్