నేడు పోచమ్మ ఆలయ వార్షికోత్సవం

84చూసినవారు
నేడు పోచమ్మ ఆలయ వార్షికోత్సవం
మార్కండేయనగర్ పోచమ్మ ఆలయం ఎనిమిదో వార్షికోత్సవాన్ని ఈనెల 11న గురువారం నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఇప్పటికే ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించామని పేర్కొన్నారు. ఉదయం అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చనలు, హోమాలు నిర్వహిస్తామని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్