నీటి సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్: మున్సిపల్ కమిషనర్

66చూసినవారు
నీటి సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నంబర్: మున్సిపల్ కమిషనర్
మణికొండ మున్సిపాలిటీ పరిధిలో నీటి సరఫరాలో ఇబ్బందులు ఉంటే టోల్ ఫ్రీ నంబర్లను సంప్రదించాలని మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ బుధవారం పేర్కొన్నారు. నీటి సమస్యలను పరిష్కరించేందుకు జలమండలి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏమైనా నీటి సమస్యలు ఉంటే 155313, 18005997575 నంబర్లకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్