హెల్త్ డిజిటల్ సర్వేకు ఎంపికైన కాలనీలు
ఫ్యామిలీ డిజిటల్ కార్డుల కోసం కుటుంబ వివరాలను సేకరించాలని జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ స్నేహ శబరిశ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాగా దీనికి ఎంపిక చేసిన కాలనీల వివరాలు. మల్కాజిగిరి- గాయత్రినగర్, కుత్బుల్లాపూర్-అయోధ్యనగర్, కూకట్పల్లి-సంగీత్ నగర్, ఉప్పల్- భవానినగర్, సికింద్రాబాద్- మహమ్మద్ గూడ, కంటోన్మెంట్-అంజయ్య నగర్, సనత్నగర్ సైంటిఫిక్ కాలనీ, ముషీరాబాద్ శ్రీనివాసపురం కాలనీల్లో శుక్రవారం సర్వే చేయనున్నారు.