చిలకలగూడ పీఎస్ పరిధిలో గుర్తు తెలియని డెడ్ బాడీ వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. గాంధీ ఆసుపత్రి ఎదుట మెట్రో పిల్లర్ నంబర్ B 1030 వద్ద దాదాపు 60-65 ఏళ్ల వయసు కలిగిన వ్యక్తి డెడ్ బాడీని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి వద్ద ఎలాంటి వివరాలు లేకపోవడంతో డెడ్ బాడీని గాంధీ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.