శేరిలింగంపల్లి: ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటా: హరీశ్‌రావు

68చూసినవారు
శేరిలింగంపల్లి: ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటా: హరీశ్‌రావు
అడుగడుగునా అన్యాయాలను నిలదీస్తున్నందుకు నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తున్నందుకు తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో తనపై నమోదైన కేసుపై మంగళవారం సామాజిక మాధ్యమం ద్వారా ఆయన స్పందించారు. సీఎం రేవంత్‌రెడ్డి తనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. సీఎంకు చేతనైంది ఒక్కటే తప్పుడు కేసులు పెట్టించడం అని ఆక్షేపించారు.

సంబంధిత పోస్ట్