షాద్ నగర్ లో లంబాడీల మహాగర్జన: శ్రీనివాస్

78చూసినవారు
షాద్ నగర్ లో లంబాడీల మహాగర్జన: శ్రీనివాస్
గిరిజనుల భాష అయిన లంబాడి భాషను భారత రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలని అయోధ్య శ్రీనివాస్ కోరారు. అలాగే గిరిజనుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15న ప్రభుత్వం సెలవు రోజుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇదే అంశాలపై ఈనెల డిసెంబర్ 29న షాద్నగర్ లో గిరిజనుల మహాగర్జన పేరుతో సభ నిర్వహిస్తున్నట్టు గురువారం స్థానిక మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలియజేశారు.

సంబంధిత పోస్ట్