రాజీ పడొద్దు.. ప్రశ్నించండి?: మాజీ ఎమ్మెల్యే

72చూసినవారు
ప్రజల్లో నిత్య చైతన్యం ఉందని, ఎవరితో రాజీ పడాల్సిన అవసరం లేదని, సమస్యలపై ప్రశ్నిస్తూనే ఉండాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం బూర్గుల గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. పాలకులను నిలదీసి తమకు కావలసిన అభివృద్ధిని సాధించుకోవాలని గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్