షాద్ నగర్ పట్టణంలో నిర్మిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణం కోసం ముందుకు వస్తున్న దాతలకు షాద్ నగర్ ఎమ్మెల్యే ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం నాడు ప్రముఖ వ్యాపారవేత్త పూర్ణచందర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు టి. కాశీననాథ్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేతులమీదుగా 5 లక్షల రూపాయలు విరాళం అందజేశారు.