పర్యావరణ హిత జీవనశైలి అనుసరించడం ప్రతి ఒక్కరి బాధ్యతఅని జీహెచ్ఎంసీ శానిటేషన్ ఇన్ స్పెక్టర్ సమేష్ పేర్కొన్నారు. మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని బాబుల్ రెడ్డి నగర్ ప్రాంతంలో సోమవారం నిర్వహించిన పర్యావరణ అవగాహన కార్యక్రమంలో భాగంగా జీవిపై ఎలిమినేషన్ చేశారు. ఈ సందర్బంగా సమేష్ మాట్లాడాతూ బహిరంగ ప్రదేశాల్లో ఉన్న చెత్తను తొలగించి, తడి - పొడి చెత్త వేరు చేసి స్వచ్ఛ ఆటోల్లో వేయాలని ప్రజలకు సూచించారు.