ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని వెంకన్నగూడ తండ గ్రామపంచాయతీలో కీర్తి శేషులు టీక్యా నాయక్ జ్ఞాపకర్థంగా డాక్టర్ ఆనంద్ నాయక్ ఆధ్వర్యంలో వాటర్ ప్లాంట్ ను ఆదివారం షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ డాక్టర్ ఆనంద్ నాయక్ గ్రామ ప్రజల కోసం తన సొంత నిధులతో వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం హర్షనీయమన్నారు.