విద్యార్థుల, మహిళల రక్షణే షీ టీం కర్తవ్యం అని షీ టీమ్ ఇంచార్జి తెలిపారు. మంగళవారం షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూఖ్‌నగర్ మండలం కమ్మదనం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ విద్యుల్లత ఆధ్వర్యంలో విద్యార్థినీలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన కల్పించారు. విద్యార్థులు సరైన మార్గంలో శ్రమిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు.