షాద్నగర్: దేవాలయ అభివృద్ధికి విరాళం
షాద్నగర్ పట్టణంలోని జానంపేట వేంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిలో తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు, ఫరూఖ్ నగర్ మాజీ ఎంపిపి చల్లా వెంకటేశ్వర్ రెడ్డి, స్వప్న దంపతులు తమ వంతు సహాయ సహకారాలు అందించారు. శనివారం టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు సమక్షంలో ఆలయంలో నిర్మిస్తున్న గరుడ, హనుమ ప్రాకార గోపుర నిర్మాణాల కోసం లక్ష రూపాయాల చెక్ ను అందించారు.