
రంగారెడ్డి: అవినీతి లేకుండా సుపరిపాలన అందిస్తున్న ఎమ్మెల్యే శంకర్
రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి ఎమ్మెల్యేను బహుశా నేను చూడలేదని గ్రంథాలయ చైర్మన్ కొప్పుల మధన్ మోహన్ రెడ్డి శనివారం అన్నారు. గ్రంథాలయం సంస్థ ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనం కార్యక్రమం ఏర్పాటు చేసిన సమ్మేళన కార్యక్రమంలో షాద్ నగర్ ఎమ్మెల్యే ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ పై ప్రశంసల వర్షం కురిపించారు.