
రంగారెడ్డి: సన్న బియ్యం పంపిణీ పథకం ప్రారంభం
తెలంగాణ ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా నిర్వహిస్తున్న ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం షాబాద్ మండలం బోడంపహాడ్ గ్రామంలోని రేషన్ దుకాణంలో ప్రారంభించారు. రేషన్ షాపు డీలర్ కోట లక్ష్మి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవీన్, కోరె నర్సిములు, చెన్నరాములు, నర్సింహ రెడ్డి, కాకనూరి బాలకిష్టి, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.