చెరువులో చేపలను వదిలిన షాద్నగర్ ముదిరాజులు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరఫరా అయిన ఉచిత చేప పిల్లలను శుక్రవారం షాద్నగర్ నియోజకవర్గం వెలిజర్లలో ముదిరాజ్ ల ఆధ్వర్యంలో గ్రామంలోని తలోని చెరువులో వదిలారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మత్స్యకారులు ఆర్థికంగా ఎదిగేందుకు మంచి అవకాశం అని అన్నారు. వాటిని సంరక్షించి, మత్స్యకారులు సంపదను పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ లు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.