IPLలో భాగంగా ఇవాళ అహ్మదాబాద్‌లో గుజరాత్, రాజస్థాన్ తలపడనున్నాయి. రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ మొదలుకానుంది. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో ఉన్న గుజరాత్.. ఈ మ్యాచ్ గెలిచి అగ్రస్థానానికి చేరుకోవాలని చూస్తోంది. మరోవైపు హ్యాట్రిక్ విన్ నమోదు చేయాలని రాజస్థాన్ భావిస్తోంది. అయితే, ఈరోజు ఎవరు గెలిచే అవకాశం ఉందో చూడాలి.