డిజిటల్ లావాదేవీల్లో SMS ఆధారిత OTP వ్యవస్థతో పాటు అదనపు అథెంటికేషన్ ప్రక్రియలను ప్రతిపాదిస్తూ ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (RBI) ముసాయిదా ఫ్రేమ్‌వర్క్‌ను విడుదల చేసింది. అథెంటికేషన్ నిమిత్తం ప్రత్యేకంగా ఒక పద్దతినే తప్పనిసరి చేయలేదని RBI తెలిపింది. మరోవైపు ఏదైనా అదనపు అథెంటికేషన్ వ్యవస్థను యాక్టివేట్ చేసేటప్పుడు విధిగా కస్టమర్ అనుమతి తీసుకోవాలని ముసాయిదాలో RBI పేర్కొంది.