పాలస్తీనాను దేశంగా గుర్తిస్తున్నాం: జమైకా

55చూసినవారు
పాలస్తీనాను దేశంగా గుర్తిస్తున్నాం: జమైకా
పాలస్తీనాను ఒక దేశంగా గుర్తిస్తున్నట్లు జమైకా ప్రభుత్వం బుధవారం అధికారికంగా ప్రకటించింది. రెండు దేశాల మధ్య సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని జమైకా ప్రధాని ఆండ్రూ హోల్నెస్ అన్నారు. ఇజ్రాయెల్ భద్రతతో పాటు పాలస్తీనియన్ల హక్కులకు మద్దతును జమైకా కోరుతోందన్నారు. తమ నిర్ణయం UN చార్టర్ సూత్రాలకు అనుగుణంగా ఉందన్నారు. ఇజ్రాయెల్ కాల్పుల విరమణ పాటించాలని, హమాస్ బందీలను విడుదల చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్