చైనా నుంచి తగ్గిన కంప్యూటర్‌ దిగుమతులు

73చూసినవారు
చైనా నుంచి తగ్గిన కంప్యూటర్‌ దిగుమతులు
చైనా నుంచి మన దేశానికి వ్యక్తిగత కంప్యూటర్ల దిగుమతులు గత ఏడాదితో పోలిస్తే 2023 నవంబరు-2024 ఫిబ్రవరి మధ్య 3% తగ్గి 917 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.7,600 కోట్ల)కు పరిమితమయ్యాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2022 నవంబరు-2023 ఫిబ్రవరి మధ్య 950.22 మి.డాలర్ల విలువైన కంప్యూటర్లు దిగుమతి అయ్యాయి. 2023 జులై-అక్టోబరు మధ్య నమోదైన 1.75 బిలియన్‌ డాలర్ల విలువైన దిగుమతులతో పోలిస్తే 2023 నవంబరు-2024 ఫిబ్రవరి మధ్య ఈ దిగుమతులు 48% తగ్గాయని తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్