కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ సంబిత్ పాత్రా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ ఉన్నత స్థాయి ద్రోహి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. లోక్‌సభలోని ప్రతిపక్ష నేతలు తమ దేశానికే ద్రోహం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. దేశంలోని నాయకుడు తన సొంత భూమికి ద్రోహం చేస్తున్నప్పుడు, సహజంగా అది చాలా తీవ్రమైన విషయమన్నారు.