పుష్ప 2 సినిమా షూటింగ్ దాదాపు మూడు సంవత్సరాల పాటు జరిగింది. ఇక రెండు సినిమాలకు కలిపి మొత్తం 5 ఏళ్ళ వరకు సమయం పట్టింది. ఈ క్రమంలో ఇన్ని సంవత్సరాలుగా 'పుష్ప' సినిమా సెట్ తన ఇల్లు అని చెప్పిన రష్మిక మందన్న టీమ్ తో కలిసున్న మధుర క్షణాలను గుర్తుకు చేసుకుంది. దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్, కెమెరామెన్, ఇతర టీమ్ సభ్యులతో కలిసి వివిధ సందర్భాల్లో దిగన ఫొటోలను రష్మిక మందన్నా పంచుకుంది.