బెంగాల్‌లోని రెండు బూత్​లలో రీపోలింగ్!

82చూసినవారు
బెంగాల్‌లోని రెండు బూత్​లలో రీపోలింగ్!
పశ్చిమ బెంగాల్లోని రెండు బూత్​లలో రీపోలింగ్ కు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. బరసత్ లోక్‌సభ నియోజకవర్గంలోని ఒక బూత్​లో, మధురాపూర్ లోక్‌సభ నియోజకవర్గంలోని ఒక బూత్ లో రీపోలింగ్ కు కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రిటర్నింగ్ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు, ఎన్నికల పరిశీలకులు ఇచ్చిన నివేదికల ఆధారంగానే EC ఈ నిర్ణయం తీసుకుంది

సంబంధిత పోస్ట్