బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా ఇతర జడ్జీలు గంటలో రాజీనామా చేయాలంటూ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. వందలాది విద్యార్థులు ఇప్పటికే ఆ దేశ సుప్రీంకోర్టును చుట్టుముట్టారు. మధ్యంతర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా సీజే ఫుల్ కోర్ట్ సమావేశపరచడం వివాదానికి దారి తీసింది. దేశంలో చెలరేగిన అల్లర్ల వెనుక జడ్జీల పాత్ర కూడా ఉందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.