హైడ్రా అంటేనే రేవంత్ రెడ్డి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆయన ఆలోచనల్లో నుంచి పుట్టిందే హైడ్రా అని పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పేదల ఇంటిపై గడ్డపార వేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అనేక చెరువుల్లో ఎవరైతే బడాబాబులు ఎస్టేట్ ల పేరుతో నిర్మాణాలు చేపట్టారో వారిపై హైడ్రా ప్రతాపం చూపాలన్నారు. కాంగ్రెస్ నాయకులు ఆర్ఆర్, ఆర్జీ టాక్స్ వసూళ్లతో దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు.