24 గంటల ఉచిత విద్యుత్ సరఫరాపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తే 8 గంటలు మాత్రమే విద్యుత్ ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. ఎకరానికి నీళ్లు పట్టాలంటే గంట సమయం పడుతుందని, అలాంటప్పుడు నిరంతరాయ విద్యుత్ ఎందుకన్నట్లు పేర్కొన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే
బీఆర్‌ఎస్ ప్రభుత్వం అందిస్తున్న 24 గంటల విద్యుత్, రైతుబంధు పథకాలను అందిస్తారా? లేదా అని అమెరికాలో ఎన్‌ఆర్ఐలు అడిగిన ప్రశ్నకు రేవంత్ ఇలా సమాధానం చెప్పాడు.