తెలంగాణలో నవంబర్ నెలలో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో పాటు రిజిస్ట్రేషన్ల ద్వారా ₹32.96 కోట్ల ఆదాయం పెరిగింది. 2023 నవంబర్లో 1,05,235 డాక్యుమెంట్ల ద్వారా ₹1127.79 కోట్ల ఆదాయం వస్తే.. ఈ నవంబర్ నెలలో 1,19,317 డాక్యుమెంట్ల ద్వారా ₹1160.75 కోట్ల ఆదాయం వచ్చింది. అప్పటితో పోలిస్తే డాక్యుమెంట్ల సంఖ్య 13.38%, ఆదాయం 2.92%పెరిగింది. HMDA పరిధిలో నవంబర్లో ₹21.09 కోట్లు, ఇక నాన్ HMDA ప్రాంతంలో ₹202.78 కోట్ల ఆదాయం సమకూరింది.