భారత్ రోబోటిక్స్ రంగంలో కీలకమైన అడుగులు వేస్తోంది. ఐఐటీ కాన్పూర్ వంటివి ఈ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అధునాతన రోబోటిక్ సాంకేతికతలపై పరిశోధనలు నిర్వహిస్తూ కొత్త ఆవిష్కరణలను అందిస్తున్నాయి. రోబోటిక్స్ విషయంలో గ్లోబల్ స్థాయిలో పోల్చితే భారత్ ఇప్పటికీ ప్రారంభదశలోనే ఉన్నా గణనీయమైన పురోగతి సాధిస్తోంది. దానికి నిదర్శనం ఐఐటీ కాన్పూర్ వాళ్లు తయారుచేసిన కుక్కలతో పోటీపడుతున్న ఈ రోబో వీడియోనే.