బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన ‘సికందర్’ విడుదలకు ఐదు గంటల ముందే నెట్టింట లీకైంది. తమిళ్‌రాకర్స్, మూవీ రూల్స్ వంటి పైరేట్ సైట్స్‌లో సినిమా విడుదల కావడంతో మూవీ టీమ్ ఆందోళన వ్యక్తం చేసింది. సల్మాన్ సరసన నేషనల్ క్రష్ రస్మిక నటించింది. ఈ మూవీని ప్రముఖ దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించారు.