‘జీరో పావర్టీ సాధించగలిగితే నా జన్మ సార్థకం అవుతుంది. ఆర్థిక అసమానతలు రూపుమాపేందుకే పీ-4 విధానం తీసుకొస్తున్నాం’ అని చంద్రబాబు అన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం మాట్లాడారు. ‘సమాజం వల్ల కొందరు ఉన్నతంగా ఎదిగారు. అలాంటి వారు తిరిగి సమాజానికి ఇవ్వాలి’ అని అన్నారు. అనంతరం ఉగాది పురస్కారాలను సీఎం ప్రదానం చేశారు.