ప్రపంచకప్ ఆడాలని నరైన్‌కు రస్సెల్ సలహా

61చూసినవారు
ప్రపంచకప్ ఆడాలని నరైన్‌కు రస్సెల్ సలహా
ఐపీఎల్‌లో అదరగొడుతున్న కేకేఆర్ స్టార్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్‌కు ఆ జట్టు మరో స్టార్ ఆండ్రీ రస్సెల్ చివరిసారిగా ఓ విజ్ఞప్తి చేశాడు. ఈ సీజన్‌ ముగిసిన తర్వాత మొదలు కానున్న టీ20 ప్రపంచ కప్‌లో నరైన్ ఆడాలని కోరాడు. స్వదేశంలో జరగనున్న ఈ పొట్టి కప్‌లో ఆడితే బాగుంటుందని పేర్కొన్నాడు. కాగా ప్రపంచకప్‌కు ఇప్పటికే ప్రాథమికంగా జట్లను ప్రకటించినప్పటికీ.. ఏమైనా మార్పులు ఉంటే చేసుకోవడానికి ఈ నెల 25 వరకు సమయం ఉంది.

సంబంధిత పోస్ట్