రాజ్యాంగాన్ని మార్చేందుకు కాషాయ పార్టీ కుట్ర: ఆనంద్ శ‌ర్మ‌

81చూసినవారు
రాజ్యాంగాన్ని మార్చేందుకు కాషాయ పార్టీ కుట్ర: ఆనంద్ శ‌ర్మ‌
కేంద్ర ప్ర‌భుత్వం రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ని కాంగ్రెస్ నేత‌, ఆ పార్టీ కాంగ్రా అభ్య‌ర్ధి ఆనంద్ శ‌ర్మ ఆరోపించారు. హిమాచ‌ల్ ప్రదేశ్‌లోని చంబాలో సోమవారం జ‌రిగిన బ‌హిరంగ సభను ఉద్దేశించి ఆయ‌న మాట్లాడారు. బీజేపీ తీరు దేశాన్ని బ‌ల‌హీన‌ప‌రుస్తుంద‌ని దీన్ని నిలువ‌రించాల్సిన అవ‌సరం ఉంద‌ని ఆనంద్ శ‌ర్మ చెప్పారు. ప్ర‌జ‌లు త‌మ ఓటు హ‌క్కును జాగ్ర‌త్త‌గా వినియోగించుకోవ‌డం ద్వారా ఇలాంటి విభ‌జ‌న చిచ్చును ఆప‌గ‌ల‌మ‌ని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్