లుకేమియా, లింఫోమా రక్త క్యాన్సర్‌ల కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన జన్యు చికిత్స క్లినికల్ ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు లభించాయి. ఈ ట్రయల్స్‌లో భాగంగా భారత్‌కు చెందిన రోగులకు జన్యు చికిత్స చేశారు. కాగా రోగుల్లో ఈ చికిత్స వల్ల 73 శాతం సానుకూల ఫలితాలు వచ్చాయి. ఈ క్లినికల్ ట్రయల్స్ ఫలితాల వివరాలు ది లాన్సెట్ హెమటాలజీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. దీంతో ఇకపై ఈ రక్త క్యాన్సర్‌లకు మన దేశంలోనే చికిత్స లభించే అవకాశం ఉంది.