పుష్ప-2 సినిమా సుకుమార్ స్థాయిని అమాంతం పెంచేసింది. టాలీవుడో సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతుండడంతో తెలుగు డైరెక్టర్ల క్రేజ్ పెరిగిపోయింది. దీంతో తెలుగు దర్శకులతో పనిచేయడానికి బాలీవుడ్ హీరోలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో షారుఖ్ ఖాన్ సుకుమార్‌తో ఓ సినిమా తీయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం సుకుమార్ బిజీ షెడ్యూల్ కారణంగా అది కుదరకపోవచ్చని కొందరు అభిప్రాయపడుతన్నారు.