AP: విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం దశలవారీగా సహకారం అందిస్తోందని మంత్రి టీజీ భరత్ చెప్పారు. స్టీల్ ప్లాంట్ కు ఇప్పటివరకు కేంద్రం రూ.11,440 కోట్లు ఇచ్చిందని ఆయన వెల్లడించారు. ఈ నెల 31న రాష్ట్రంలో ఉక్కుమంత్రి కుమారస్వామి పర్యటిస్తారని తెలిపారు. సీఎం చంద్రబాబుతో కేంద్రమంత్రి సమావేశమవుతారని, విశాఖ స్టీల్ ప్లాంట్ పై చర్చిస్తారని మంత్రి టీజీ భరత్ వెల్లడించారు.