సినిమా ఇండస్ట్రీలో కొత్త కలయికతో సినిమా రానున్నట్లు తెలుస్తోంది. వరుస డిజాస్టర్లతో సతమవుతున్న స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, విభిన్న కథలతో మంచి ఫామ్‌లో ఉన్న మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి కలిసి ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సేతుపతి కథను సింగిల్ సిట్టింగ్‌లో విని ఒప్పుకున్నారని టాక్. తాను చేస్తున్న ఇతర సినిమాలను కూడా పక్కనపెట్టి ఈ ప్రాజెక్ట్ కోసం కాల్‌షీట్స్ ఇవ్వడానికి సిద్ధమయ్యారని సమాచారం.