సంగారెడ్డి జిల్లా చౌటాకూర్ మండల కేంద్ర గ్రామంలోని సిఎస్ఐ చర్చి పాస్టరేట్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి నిర్వహించినటువంటి క్రిస్మస్ క్యారిల్స్ సందర్భంగా యేసుక్రీస్తు ప్రభువు యొక్క జననం పరమార్ధ శుభవార్తను రెవ ఎం. రవికుమారు, ప్రెస్బిటర్ ఇన్ ఛార్జ్ గురువులు భోధించారు. ఈ కార్యక్రమంలో సండేస్కూల్ పిల్లలు, సంఘ పెద్దలు, ప్రభుకిరణ్, ప్రేమ్, ప్రసన్న, సుకుమార్, మనోజ్, కిరణ్, మోహన్ మిగితా యూత్ సభ్యులు పాల్గొన్నారు.