ప్రభుత్వ మధ్యాహ్న భోజన మెనూలో ఇప్పటికే వెజిటబుల్ బిర్యానీ చేర్చగా , రేపటినుండి ఉదయం పూట రాగి జావ అదించేందుకు తెలంగాణా ప్రభుత్వం నిశ్చయించింది. సత్య సాయి అన్నపూర్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇప్పటికీ ప్రతీ జిల్లాకు 500కేజీ ల రాగి జవ పౌడెర్ మరియు 500 కేజీల బెల్లం పంపిణీ చేశారు. రేపటి నుంచి ప్రభుత్వం పాఠశాలలో చదివే ప్రతీ విద్యార్థికి పావు లీటర్ రాగి జావ అందిస్తారు. దీని ద్వారా రక్త హినత పోషక ఆహార లోపం సమస్యలు అధిగమించవచ్చు అని సత్య సాయి అన్నపూర్ణ ట్రస్ట్ సంగారెడ్డి జిల్లా కోఆర్డినేటర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు.