అందోల్ జోగిపేట్ మున్సిపల్ లోని 20 వార్డులో సిక్లికర్ గల్లీలో సీసీ రోడ్డు లేకపోవడం చాలా ఇబ్బందిగా ఉండేది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లగా వారికి సిసి రోడ్డు మంజూరు చేయడం జరిగింది. వారి కాలనీలో శనివారం సీసీ రోడ్డు వేయడం జరిగింది. వారు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ వార్డు కౌన్సిలర్ చందర్ నాయక్ ను ఘనంగా సన్మానించారు.