మిరుదొడ్డి: ధర్మ సమాజ్ పార్టీ మహా సమ్మేళనంను విజయవంతం చేయండి
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో ధర్మ సమాజ్ పార్టీ మొదటి మహా సమ్మేళనముకు సంబందించిన కరపత్రాలను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు ర్యాగట్ల చందు మాట్లాడుతూ డిఎస్పీ పార్టీ ఆవిర్భవించి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నందున నవంబర్ 3న మొదటి ఆవిర్భావ మహా సమ్మేళనం జరుపుకుంటున్నామని, కార్యక్రమానికి పది వేల మంది హాజరవుతారని అన్నారు. ఈ సభకు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు.