కెసిఆర్ పై ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదు: ఎమ్మెల్యే
మాజీ సీఎం కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు హైడ్రా విగ్రహం పేరుతో కాంగ్రెస్ నాయకులు నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. గాంధీభవన్ లో గాడ్సేలు దూరారని విమర్శించారు.