నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్ మండలం కృష్ణాపూర్ గ్రామంలో రైతులు సాగు చేస్తున్న జొన్న పంటలను ఖేడ్ ఎడిఏ నూతన్ కుమార్ ఏవో వెంకటేశం, ఏఈవో కృష్ణవేణి కలిసి గురువారం పరిశీలించారు. జొన్న పంటపై పేను బంక కీటకాన్ని గుర్తించారు. పిప్రోనిల్ 2 ఎంఎల్, లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలని సూచించారు. ప్రస్తుతం సాగు చేస్తున్న పంటలను సంబంధిత ఏఈఓ వద్ద నమోదు చేసుకోవాలని చెప్పారు.